రష్యాపై భీకర స్థాయిలో డ్రోన్లతో అటాక్ చేసింది ఉక్రెయిన్. శనివారం రష్యా చేసిన దాడికి ప్రతీకారంగా ఉక్రెయిన్, వ్లాదిమిర్ ప్రాంతంలో ఉన్న వేర్‌హౌజ్‌ను టార్గెట్ చేసింది. రష్యాన్‌లో ఆన్‌లైన్ రిటేలర్‌గా ఉన్న వైల్డ్‌బెర్రీస్ వేర్‌హౌజ్‌పై దాడి చేసింది. దీన్ని రష్యా అమెజాన్‌గా కీర్తిస్తుంటారు. మాస్కోకు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్‌హౌజ్‌ను డ్రోన్‌తో అటాక్ చేసింది. వైల్డ్ బెర్రీస్ వేర్‌హౌజ్.. రష్యాలో కీలకమైన లాజిస్టిక్ హబ్. రష్యా మిలిటరీకి డ్రోన్ కాంపోనెంట్లు, నావిగేషన్ ఎక్విప్మెంట్, ఇతర సామాగ్రిని ఈ వేర్‌హౌజ్‌ల నుంచి సరఫరా చేస్తుంటారు.