టామ్ హాలెండ్, జెండయా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’. జులై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకి వసూళ్లు సునామీలా వస్తున్నాయి. మొదటి వారంలోనే 900 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ఇప్పటివరకూ బాక్సాఫీస్ వద్ద 927 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.8,830 కోట్లు) వసూళ్లు చేసింది. దీంతో ప్రపంచ సినిమా చరిత్రలోనే రెండో అతి పెద్ద గ్లోబల్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.