జూలై 20న కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన పార్లమెంట్ మార్చ్ కు సంఘీభావంగా దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి.ఈ సందర్భంగా విద్యార్దులపై నమోదు చేసిన కేసుల్ని వెనక్కి తీసుకోవడం లేదా మూసేసే విషయంలో పలు రాష్ట్రాలు ఇంకా గందరగోళంలోనే ఉన్నాయి. పిటిషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఇవాళ రాష్ట్రాలకు క్లారిటీ ఇచ్చింది.
ఉపసంహరణ విషయంలో రాష్ట్రాలు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో అప్పట్లో నిరసనలకు దిగిన విద్యార్ధులకు భారీ ఊరట లభించినట్లయింది.