ప్రముఖ నటుడు అజిత్ తన 64వ చిత్రం (AK64) కోసం రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. అధిక రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు తాజాగా టైటిల్ ప్రకటించారు. ‘డేర్ డెవిల్'(Dare Devil) పేరుతో ఈ సినిమాను రూపొందించనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ సందర్భంగా టైటిల్ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. పాచికల నేపథ్యంతో డిజైన్ చేసిన ఈ పోస్టర్ కు మంచి స్పందన వస్తోంది.