loader

వివాదంలో ఇరుముడి.. ఆ సన్నివేశాలు తీసేయాలంటూ డిమాండ్

ఇరుముడి సినిమా ఊహించని వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా పై టీచర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉపాధ్యాయుల ప్రతిష్టను దిగజార్చేలా ఉన్న అభ్యంతరకర సన్నివేశాలను సినిమాలో చూపించారని.. ఆ సన్నివేశాలను వెంటనే సినిమా నుంచి తొలగించాలని టీచర్స్ డిమాండ్ చేస్తున్నారు. సీలేరు జడ్పీ హైస్కూల్ పేరుతో పాటు ప్రభుత్వ విద్యార్థుల యూనిఫామ్‌ను చూపిస్తూ ఉపాధ్యాయురాలి పాత్రను నెగెటివ్‌గా చూపించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సినిమాలో ఆ సీన్స్ ను వెంటనే తొలగించాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య […]

రాఖీ యాడ్‌తో ట్రోలింగ్ బారిన‌ కృతి సనన్ .. ఘాటుగా స్పందించిన కంగనా రనౌత్!

కృతి సనన్ నటించిన ఓ ప్రకటనపై నటి, ఎంపీ కంగనా రనౌత్ కూడా స్పందించడంతో విషయం మరింత హాట్ టాపిక్‌గా మారింది. రక్షా బంధన్ వంటి సాంప్రదాయ పండుగకు సంబంధించిన ప్రకటనలో ఇలాంటి దుస్తులు అవసరమా అంటూ కంగనా రనౌత్ ప్రశ్నించారు. మహిళలకు చీరలు, లెహంగాలు, జీన్స్, ఇతర ఆధునిక దుస్తులు ఇలా ఎన్నో ఎంపికలు ఉన్నప్పటికీ, సోదరుడికి రాఖీ కట్టే సందర్భంలో ఇలాంటి బోల్డ్ అవుట్‌ఫిట్ ఎందుకు ఎంచుకున్నారని ఆమె తన సోషల్ మీడియా వేదికగా […]

రాజధాని అమరావతికి.. రూ.1,200 కోట్లు విడుదలకు గ్రీన్ సిగ్నల్

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రాజధాని పనులను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం నిధుల విడుదలలో స్పీడ్ పెంచింది. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులను ఎప్పటికప్పుడు విడతల వారీగా మంజూరు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా ముఖ్యంగా అమరావతి నిర్మాణ పనుల కోసం రూ.1,200 కోట్లను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి మున్సిపల్ శాఖ నుంచి ఇప్పటికే అధికారిక అనుమతులు కూడా లభించాయి. త్వరలోనే ఈ భారీ నిధులు క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CRDA) […]

అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌లకు బిగ్ షాక్.. లైసెన్సులు రద్దు

ఆన్‌లైన్‌లో విషపూరితమైన ధతూరా (ఉమ్మెత్త) పండ్లు, విత్తనాలను మానవ వినియోగానికి విక్రయించిన వ్యవహారంలో కర్ణాటక ఆహార భద్రత, ఔషధాల పరిపాలన విభాగం (FDA) అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌లకు జారీ చేసిన ఫుడ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్లను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సస్పెండ్ చేసింది. ఈ ప్లాట్‌ఫామ్‌లలో ధతూరా పండ్లు, విత్తనాలను ఆహారంగా విక్రయిస్తున్నట్లు విభాగం నిర్వహించిన విచారణలో తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఉమ్మెత్త పండ్లు, విత్తనాలను మానవ వినియోగానికి అందిస్తున్న అన్ని ఆన్‌లైన్ లిస్టింగ్‌లు, […]

క్రీడాకారిణి ప్రతిభ తక్కడపల్లి మరో సంచలన వీడియో!

ఇంటర్నేషనల్ క్రీడాకారిణి ప్రతిభ తక్కడపల్లి మరోసారి వీడియో విడుదల చేశారు. 2020 డిసెంబర్లో జరిగిన ఈ సంఘటనలో స్పోర్ట్స్ మినిస్టర్ కార్యాలయం నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని ఆమె తెలిపారు. తనకు అనేక క్రీడా లక్ష్యాలు ఉండటం వల్లే ఆ సమయంలో మౌనంగా ఉండాల్సి వచ్చిందన్నారు. ప్రజలు, మీడియా ఈ వివాదంలో ఒకే విషయాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నాయి. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ ఎలాంటి సంబంధాలు లేవని, కేవలం ఓ క్రీడాకారిణిగా దేశం కోసం ఆడటమే […]

కెనడా ప్రధాని మార్క్‌పై ట్రంప్‌ వ్యక్తిగత దూషణ

అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం తీవ్రమైన నేపథ్యంలో కెనడా ప్రధాని మార్క్ కార్నీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తిగత దూషణకు  దిగాడు. మరోవైపు కెనడాలోని ఒంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ను ట్రంప్ దూషించారు. తోటి పిల్లల నుంచి డబ్బులు లాక్కొనే రకం అని ఫోర్డ్ ను ట్రంప్ విమర్శించారు. వీటిపై అసహనం వ్యక్తంచేసిన కెనడా అమెరికాపై ప్రతీకార సుంకాలకు సన్నాహాలు చేస్తోంది. ఈనేపథ్యంలో ఆ వివరాలను కెనడా నేడు ప్రకటించే అవకాశం ఉంది.

డిగ్రీ ప్రవేశాలకు కౌన్సెలింగ్.. షెడ్యూల్‌లో మార్పులు..

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) డిగ్రీ ప్రవేశాల ప్రక్రియలో భాగంగా వెబ్ ఆప్షన్ల నమోదుకు మరింత సమయం కల్పించింది. తొలుత ఆగస్టు 23తో ముగియాల్సిన వెబ్ ఆప్షన్ల గడువును ఆగస్టు 27 వరకు పొడిగించింది. ఆగస్టు 27 తర్వాత మరోసారి గడువు పొడిగింపు ఉండదని సమాచారం. తాజా షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 28న ఇప్పటికే నమోదు చేసిన వెబ్ ఆప్షన్లలో మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. అనంతరం సెప్టెంబర్ 2న సీట్ల కేటాయింపు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON