ఇంటర్నేషనల్ క్రీడాకారిణి ప్రతిభ తక్కడపల్లి మరోసారి వీడియో విడుదల చేశారు. 2020 డిసెంబర్లో జరిగిన ఈ సంఘటనలో స్పోర్ట్స్ మినిస్టర్ కార్యాలయం నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని ఆమె తెలిపారు. తనకు అనేక క్రీడా లక్ష్యాలు ఉండటం వల్లే ఆ సమయంలో మౌనంగా ఉండాల్సి వచ్చిందన్నారు. ప్రజలు, మీడియా ఈ వివాదంలో ఒకే విషయాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నాయి. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ ఎలాంటి సంబంధాలు లేవని, కేవలం ఓ క్రీడాకారిణిగా దేశం కోసం ఆడటమే తన లక్ష్యమని క్లారిటీ ఇచ్చారు.