ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రాజధాని పనులను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం నిధుల విడుదలలో స్పీడ్ పెంచింది. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులను ఎప్పటికప్పుడు విడతల వారీగా మంజూరు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా ముఖ్యంగా అమరావతి నిర్మాణ పనుల కోసం రూ.1,200 కోట్లను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి మున్సిపల్ శాఖ నుంచి ఇప్పటికే అధికారిక అనుమతులు కూడా లభించాయి. త్వరలోనే ఈ భారీ నిధులు క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CRDA) ఖాతాకు బదిలీ కానున్నాయి.