తమ కంపెనీ ఉద్యోగుల్లో ఎవరికి ప్రమోషన్ ఇవ్వాలో నిర్ణయించేందుకు AI వ్యవస్థను ఉపయోగిస్తున్నట్లు ఫుడ్-టెక్ కంపెనీ Wonder వ్యవస్థాపకుడు, బిలియనీర్ వ్యాపారవేత్త మార్క్ లోర్ వెల్లడించారు. మార్క్ లోర్‌కు చెందిన Wonderలో ఉద్యోగుల పనితీరును అంచనా వేసేందుకు ప్రత్యేకమైన AI ఆధారిత వ్యవస్థను ఉపయోగిస్తున్నారు.
ప్రతి ఆరు నెలలకు ఉద్యోగి పనితీరును కనీసం 12 మంది సహోద్యోగుల అంచనా, వారి రేటింగ్‌లతో పాటు రాతపూర్వక ఫీడ్‌బ్యాక్‌ను కూడా AI వ్యవస్థకు అందిస్తారు. అనంతరం ఉద్యోగి పనితీరుపై ఒక సమగ్ర నివేదికను AI రూపొందిస్తుంది.