ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రీచ్మెంట్ (ఏపీ గ్రీన్) సొసైటీ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా జనసేన పార్టీ శాసన మండలి సభ్యుడు కొణిదెల నాగబాబు శుక్రవారం అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని అరణ్యభవన్‌లో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో నాగబాబు తన సతీమణి పద్మజతో కలిసి పాల్గొన్నారు. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తన సోదరుడు నాగబాబుకు..ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.