loader

సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసేందుకు మంత్రి కొండా సురేఖ అపాయింట్‌మెంట్..!

మంత్రి కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యలతో తలెత్తిన వివాదంపై టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసి రాఖీ కట్టేందుకు సురేఖ అపాయింట్‌మెంట్ కోరారు. ఇది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాంగ్రెస్ అధిష్ఠానం ఆమెపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది.

భారీగా పెరిగిన చక్కెర ధర..గగ్గోలు పెడుతున్న సామాన్య ప్రజలు

దేశీయ మార్కెట్‌లో చక్కెర ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెట్‌లో చక్కెర కిలో రేటు ఊహించని విధంగా రూ. 75 నుండి రూ. 80 కి చేరడంతో నిత్యావసర బడ్జెట్ తలకిందులై గగ్గోలు పెడుతున్నారు. మార్కెట్‌లో డిమాండ్‌కు తగినట్లుగా సరఫరా లేకపోవడమే ఈ హఠాత్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. చక్కెర ధర పెరగడం వల్ల సామాన్యులతో పాటు చిన్నతరహా స్వీట్ షాపులు, టీ కొట్టు […]

గ్రాండ్ చెస్ టూర్ విజేతగా ప్రజ్ఞానంద రికార్డ్!

భారత యువ గ్రాండ్ మాస్టర్ రమేష్‌బాబు ప్రజ్ఞానంద అంతర్జాతీయ చెస్ రంగంలో సరికొత్త చరిత్ర లిఖించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ చెస్ టూర్ (GCT) ఫైనల్స్‌లో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి, ఈ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. తుది సమరంలో అమెరికాకు చెందిన దిగ్గజ ఆటగాడు ఫ్యాబియానో కరువానాపై 15-13 తేడాతో ప్రజ్ఞానంద సంచలన విజయం సాధించారు. విజయంతో  వచ్చే ఏడాది జరగబోయే గ్రాండ్ చెస్ టూర్ పోటీలకు నేరుగా అర్హత (బెర్త్) […]

రాఖీ పౌర్ణమి

రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా  జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు.అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON