భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తొలిసారిగా అంతరిక్ష రంగాన్ని ప్రైవేటీకరణ వైపు నడిపిస్తోంది. ఇందులో భాగంగా తమిళనాడులోని కులశేఖరపట్నం వద్ద నిర్మిస్తున్న నూతన స్పేస్ పోర్ట్‌ను భారత ప్రభుత్వ సంస్థ అయిన IN-SPACeకు అప్పగించింది. దేశ వాణిజ్య సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో, ఈ లాంచ్ ప్యాడ్ కేంద్రాన్ని టెండర్ల ద్వారా ప్రైవేటీకరించి ఇస్రో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించింది. కులశేఖరపట్నంలో 1,200 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ. 950 కోట్ల వ్యయంతో ఇస్రో చేపట్టిన రెండవ రాకెట్ ప్రయోగ కేంద్రం పనులు దాదాపు పూర్తికావచ్చాయి.