ఉత్తర ప్రదేశ్ లోని వారాణాసి ఎయిర్ పోర్టులో గన్ పేలిన ఘటన తీవ్ర దుమారంగా మారింది. అజంగఢ్‌కు చెందిన వ్యక్తిగా తన భార్యతో కలిసి ముంబైకి వెళ్లేందుకు విమానం ఎక్కే ముందు తన వద్ద తుపాకీ, ఒక మ్యాగజైన్ ఉన్నాయని అధికారులకు చెప్పాడు. ఈ క్రమంలో గన్ పేలడంతో.. బుల్లెట్ మొదటగా నేలను తాకి, అనంతరం ఇద్దరు AAICLAS స్క్రీనర్లకు తగిలింది.
ఈ బుల్లెట్ ఒక మహిళా సిబ్బంది తొడకు, మరో పురుషుడి చేతికి తగిలి తీవ్ర గాయమైనట్లు భద్రత సిబ్బంది వెల్లడించారు.