స్టైపెండ్ పెంపు కోరుతూ ఆందోళన చేపట్టిన ఏపీ జూనియర్ డాక్టర్లు రేపటి నుంచి అత్యవసర సేవలను పూర్తిగా బహిష్కరించాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే సాధారణ వైద్య సేవలను నిలిపివేసిన వైద్యులు, ఇప్పుడు ఎమర్జెన్సీ సేవలను కూడా ఆపేస్తుండటంతో వైద్య రంగంలో తీవ్ర కలకలం రేగింది. జూనియర్ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎమర్జెన్సీ, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లలో వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్య సిబ్బందికి అన్ని రకాల సెలవులను రద్దు చేశారు.