బాలీవుడ్ ప్రముఖ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌లకు పాన్ మసాలా ఇలాచీ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నందుకు ఎఫ్‌డీఏ ఈ నోటీసులు జారీ చేసింది. ఈ యాడ్స్ 2006 ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ చట్టాన్ని, దాని సవరించిన నిబంధనలను ఉల్లంఘించేలా ఉన్నాయని ఎఫ్‌డీఏ తన నోటీసులో పేర్కొంది. సోషల్ మీడియా మరియు ఇతర ప్లాట్‌ఫారమ్‌ల నుంచి ఆ ప్రమోషనల్ కంటెంట్‌ను తొలగించాలని, దీనిపై తమ వివరణను 15 రోజుల్లోగా సమర్పించాలని ఆ నటులను ఎఫ్‌డీఏ ఆదేశించింది.