ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ‘దిమాగీ నక్సలిజం (మేధోపరమైన నక్సలిజం)’ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం చెలరేగింది. ప్రధాని వ్యాఖ్యలకు కౌంటర్‌గా తాను ‘గర్వపడే దిమాగీ నక్సల్ ’ అని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం ప్రకటించారు. రాజకీయ ప్రత్యర్థులపై ప్రధాని మోదీ రెచ్చగొట్టే పదజాలాన్ని వాడుతున్నారని, ఇది ఆయనలోని రాజకీయ నిస్పృహను ప్రతిబింబిస్తోందని ఆరోపించింది.