loader

50 వేల కోట్ల డీల్.. భారత్ కు రష్యా బంపర్ ఆఫర్

2018లో ఒప్పందం ప్రకారం భారత్ ఇప్పటికే 4 ఎస్-400 స్క్వాడ్రన్లను అందుకోగా,   చివరి 5వ స్క్వాడ్రన్ నవంబర్ నాటికి రష్యా నుంచి మన దేశానికి చేరుకోనుంది.   భారత వైమానిక దళం (IAF) కోసం మరిన్ని ఎస్-400 క్షిపణి స్క్వాడ్రన్లను అందించే టెండర్   ప్రక్రియలో భాగంగా రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కీలక వివరాలతో కూడిన డ్రాఫ్ట్‌ను సమర్పించింది.   సుమారు రూ.50,000 కోట్ల అంచనా వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ మెగా డీల్ ద్వారా భారత వైమానిక దళానికి […]

బీజేపీ నేత కిడ్నాప్.. టీడీపీ ఎమ్మెల్యేపై కేసు

బెంగళూరు బీజేపీ నేత డా. రవిప్రకాష్ కిడ్నాప్ కు సంబంధించి మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ పై బెంగళూరు పీఎస్ లో కేసు నమోదు చేశారు. తన భర్తను టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ కిడ్నాప్ చేయించారని నాలుగు వాహనాల్లో వచ్చి తన భర్త రవిప్రకాశ్ ను పుట్టా సుధాకర్ అనుచరులు కిడ్నాప్ చేశారని బెంగళూరు రాజరాజేశ్వరినగర్ పీఎస్ లో రవిప్రకాష్ భార్య సబీనా ఫిర్యాదు చేశారు ఆయన కుమారుడు పుట్టా రవి కుమార్ పై కూడా ఆమె ఫిర్యాదు చేశారు.

కోహ్లీ కొత్త టాటూ.. వైరల్ అవుతున్న డిజైన్‌ వెనుక..

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆయన ఎడమ చేతిపై కనిపిస్తున్న కొత్త టాటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుండ్రంగా ఉండి,  మధ్య నుంచి అలల మాదిరిగా బయటకు విస్తరిస్తున్న ఈ డిజైన్‌ను చూసి.. దీని వెనుక ఉన్న అర్థం ఏమిటనే చర్చ మొదలైంది. తాజాగా కనిపిస్తున్న గుండ్రటి డిజైన్‌ను చూస్తే అది వోర్టెక్స్ లేదా రిపుల్ తరహా తరంగాల నమూనాలా కనిపిస్తోంది. దీంతో ఇది మార్పు, పరిణామం లేదా జీవితంలో ముందుకు సాగడాన్ని సూచిస్తుందనే ఊహాగానాలు […]

భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్.. 30 రోజుల పాటు వీసా ఫ్రీ ఎంట్రీ..

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల ఉజ్బెకిస్తాన్ పర్యటనలో భారతీయ పౌరులు ఇకపై 30 రోజుల పాటు ఎలాంటి వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించే గొప్ప వెసులుబాటును ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవకత్ మిర్జియోయెవ్ అధికారికంగా ప్రకటించారు.  ఆదివారం తాష్కెంట్‌లో ప్రధాని మోదీతో కలిసి నిర్వహించిన ప్రతినిధుల స్థాయి ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ఆయన ఈ చారిత్రక నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ సరికొత్త వీసా రహిత విధానం వల్ల రెండు దేశాల మధ్య ప్రజల సంబంధాలు […]

చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు క్రెడిట్ చోరీపై వైఎస్ జగన్ ఆగ్రహం

 చంద్రబాబు తాను చేయని దానిని చెప్పుకోవడంపై వైఎస్ జగన్ ప్రశ్నించారు. వెలిగొండపై చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా చేస్తున్న హడావిడి చూస్తే ఆశ్చర్యమేస్తోంది. కొన్ని రోజులుగా చేస్తున్నవన్నీ వెలిగొండ నిర్మాణ చరిత్రను మార్చే పబ్లిసిటీ ఫీట్లు, క్రెడిట్ చోరీ ప్రయత్నాలే. వెలిగొండ చరిత్ర చాలా స్పష్టం. శిలాఫలకం మాత్రమే మీది… సంకల్పం, సమగ్ర నిర్మాణం వైయస్సార్ గారిది. ఆ ఎనిమిదేళ్లలో మీరు ఖర్చుచేసింది కేవలం రూ.10 లక్షలు. అదీ శంకుస్థాపన, సభ ఏర్పాట్లకే. వెలిగొండపై మీ చిత్తశుద్ధి ఏమిటో ఈ ఒక్క […]

మార్కాపురం జిల్లా గడ్డపై కొత్త చరిత్ర..రేపు వెలిగొండ వద్ద కలుద్దాం: సీఎం చంద్రబాబు

మార్కాపురం జిల్లా గడ్డపై కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోందంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు  నాయుడు X వేదికగా హర్షం వ్యక్తం చేశారు. దాదాపు 30 ఏళ్లుగా కరువు పీడిత ప్రాంత ప్రజలు కంటున్న వెలిగొండ కల కృష్ణమ్మ జలాలతో కళ్లముందు నిజం కాబోతోందన్నారు. కరవుతో అల్లాడుతున్న పశ్చిమ ప్రకాశం ప్రజల కష్టాలను తీర్చాలన్న సంకల్పంతో 1996లో తాను శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేసి సోమవారం ప్రారంభించే అవకాశం రావడం ఎంతో భావోద్వేగానికి, సంతోషానికి గురిచేస్తోందని సీఎం చంద్రబాబు […]

హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం.. 100 ఎకరాల్లో నిర్మాణం!

రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ పరిధిలోని ముచ్చెర్ల సమీపంలో ఉన్న భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో అత్యంత భారీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో, ఏకంగా 1.32 లక్షలకు పైగా ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యంతో ఈ స్టేడియాన్ని రూపొందించాలని  ప్రతిపాదించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రభుత్వం అవసరమైన భూమిని కేటాయించనుండగా, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆర్థిక నిధులను సమకూర్చి నిర్మాణం మరియు నిర్వహణ బాధ్యతలు చేపట్టేలా చర్చలు జరుగుతున్నాయి.

కొత్త పార్టీ కోసమే విజయసాయిరెడ్డి ఆరోపణలు: సజ్జల

వైఎస్సార్‌సీపీలో ఎలాంటి కోటరీ లేదని, పార్టీలో నెంబర్ 2, 3 కూడా లేరని.. సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా ఉన్న సాయిరెడ్డికి జగన్ అన్ని మతాలను సమానంగా గౌరవిస్తారని తెలుసన్నారు. వైఎస్సార్ హయాంలోనే తిరుమలలో అన్యమతస్తుల ఉద్యోగాలపై చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. నిజంగానే వైఎస్ కుటుంబానికి మతమార్పిడుల అజెండా ఉంటే దశాబ్దాలుగా వారితో ఉన్న సాయిరెడ్డికి కూడా మతమార్పిడి జరిగి ఉండేదని ఎద్దేవా చేశారు. కొత్త పార్టీ పెట్టుకునేందుకు జగన్‌పై […]

ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం

భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల ఉజ్బెకిస్థాన్ పర్యటనలో భాగంగా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ఓలీ దరాజలీ దోస్త్లిక్’ (Order of Oliy Darajali Dustlik) అవార్డును అందుకున్నారు. తాష్కెంట్‌లో ఆదివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ ఈ పురస్కారాన్ని ప్రధాని మోదీకి స్వయంగా ప్రదానం చేశారు. ఈ అత్యున్నత గౌరవం 140 కోట్ల మంది భారత ప్రజలకు,భారత్-ఉజ్బెకిస్థాన్‌ల శతాబ్దాలనాటి సత్సంబంధాలకు దక్కిన పురస్కారమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

వెలిగొండ ప్రాజెక్టు ట్రయల్ సక్సెస్.. హెడ్ రెగ్యులేటర్‌కు కృష్ణా జలాలు

దశాబ్దాలుగా ప్రకాశం తో పాటు పలు ఉమ్మడి జిల్లాల ప్రజలు ఎదురుచూస్తున్న ఎంతో ప్రతిష్టాత్మకమైన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశకు సంబంధించిన ట్రయల్ రన్‌ను అధికారులు ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం అధికారులు కొల్లం వాగు వద్ద ప్రాజెక్టు గేట్లను ఎత్తి సొరంగ మార్గంలోకి కృష్ణా జలాలను విడుదల చేశారు. గేట్ల పనితీరు, సొరంగ మార్గంలో నీటి ప్రవాహ వేగం మరియు తరలింపు ప్రక్రియను ఇంజనీరింగ్ నిపుణులు నిశితంగా పరిశీలించారు. కృష్ణా జలాలు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON