రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ పరిధిలోని ముచ్చెర్ల సమీపంలో ఉన్న భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో అత్యంత భారీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో, ఏకంగా 1.32 లక్షలకు పైగా ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యంతో ఈ స్టేడియాన్ని రూపొందించాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రభుత్వం అవసరమైన భూమిని కేటాయించనుండగా, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆర్థిక నిధులను సమకూర్చి నిర్మాణం మరియు నిర్వహణ బాధ్యతలు చేపట్టేలా చర్చలు జరుగుతున్నాయి.