భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల ఉజ్బెకిస్థాన్ పర్యటనలో భాగంగా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ఓలీ దరాజలీ దోస్త్లిక్’ (Order of Oliy Darajali Dustlik) అవార్డును అందుకున్నారు. తాష్కెంట్లో ఆదివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ ఈ పురస్కారాన్ని ప్రధాని మోదీకి స్వయంగా ప్రదానం చేశారు. ఈ అత్యున్నత గౌరవం 140 కోట్ల మంది భారత ప్రజలకు,భారత్-ఉజ్బెకిస్థాన్ల శతాబ్దాలనాటి సత్సంబంధాలకు దక్కిన పురస్కారమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.