దశాబ్దాలుగా ప్రకాశం తో పాటు పలు ఉమ్మడి జిల్లాల ప్రజలు ఎదురుచూస్తున్న ఎంతో ప్రతిష్టాత్మకమైన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశకు సంబంధించిన ట్రయల్ రన్‌ను అధికారులు ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం అధికారులు కొల్లం వాగు వద్ద ప్రాజెక్టు గేట్లను ఎత్తి సొరంగ మార్గంలోకి కృష్ణా జలాలను విడుదల చేశారు. గేట్ల పనితీరు, సొరంగ మార్గంలో నీటి ప్రవాహ వేగం మరియు తరలింపు ప్రక్రియను ఇంజనీరింగ్ నిపుణులు నిశితంగా పరిశీలించారు. కృష్ణా జలాలు గంటవానిపల్లి క్రాస్ హెడ్ రెగ్యులేటర్‌కు చేరుకున్నాయి