2018లో ఒప్పందం ప్రకారం భారత్ ఇప్పటికే 4 ఎస్-400 స్క్వాడ్రన్లను అందుకోగా, చివరి 5వ స్క్వాడ్రన్ నవంబర్ నాటికి రష్యా నుంచి మన దేశానికి చేరుకోనుంది. భారత వైమానిక దళం (IAF) కోసం మరిన్ని ఎస్-400 క్షిపణి స్క్వాడ్రన్లను అందించే టెండర్ ప్రక్రియలో భాగంగా రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కీలక వివరాలతో కూడిన డ్రాఫ్ట్‌ను సమర్పించింది. సుమారు రూ.50,000 కోట్ల అంచనా వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ మెగా డీల్ ద్వారా భారత వైమానిక దళానికి సరికొత్త ఊపిరి రానుంది.