కర్ణాటక విద్యావర్థక సంఘం 50వ వార్షికోత్సవాల ముగింపు సదస్సుకు విచ్చేసిన బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ కు వ్యతిరేకంగా కొన్ని సంఘాలు ధర్నాకు దిగాయి. భాజపాకు చెందిన ప్రతినిధులు ‘గో బ్యాక్ ప్రకాశ్ రాజ్’ అంటూ నినాదాలు చేయగా, ప్రకాశ్ రాజు కు మద్దతుగా వచ్చిన వారు ‘ప్రకాశ్ రాజ్ కు స్వాగతం’ అంటూ నినాదాలు చేశారు. విద్యావర్ధక సంఘం ముందు ఏర్పాటు చేసిన ప్రకాశ్ రాజ్ బ్యానర్ కు కొందరు మసి పూసి దాన్ని చించి వేశారు.