loader

ఫోన్‌పే కొత్త ఫీచర్.. నెట్ లేకుండానే పేమెంట్స్..!

డిజిటల్ చెల్లింపుల రంగంలో ప్రముఖ సంస్థ PhonePe కీలకమైన కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటర్నెట్ అవసరం లేకుండానే UPI చెల్లింపులు చేసుకునే అవకాశం కల్పించే ‘PhonePe UPI 123Pay’ సేవను ఆగస్టు 31, 2026న ప్రారంభించింది. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా, SMS ఆధారిత టెక్నాలజీ ద్వారా UPI లావాదేవీలు నిర్వహించుకునేలా ఈ వ్యవస్థను అభివృద్ధి చేశారు. తక్కువ 2G నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లోనూ సేవలు అందుబాటులో ఉండేలా రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది.

కేసీఆర్ కు రూ.1.24 కోట్లు ఇచ్చాం…ఇంకా ఇస్తున్నాం..: సీఎం రేవంత్

కల్వకుంట్ల కుటుంబం గుంపు మందలా జమై మంది సొమ్ము తిన్నారు… ఇప్పటికీ తింటున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయ్యింది… ఇన్నిరోజులు కేసీఆర్ విధులకు హాజరుకాకుండానే ఏకంగా రూ.12400000 జీతం తీసుకున్నాడని రేవంత్ తెలిపారు. కేసీఆర్ సెక్యూరిటీ, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ఇతర అవసరాల కోసం ప్రభుత్వం ఏకంగా రూ.22 కోట్లు ఖర్చు చేసిందని సీఎం తెలిపారు. ఫామ్ హౌస్ వీడి బయటకురాని మాజీ ముఖ్యమంత్రి కోసం ఈ ప్రభుత్వం కూడా భారీగా ఖర్చుచేయాల్సి వస్తోందన్నారు

అమెరికాలో వరదలు..20 మంది మృతి!

అమెరికాలోని ప్రసిద్ధ గ్రాండ్ కెన్యాన్ ప్రాంతాన్ని భారీ ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో 19మంది మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. భారీ సంఖ్యలో పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పార్కులోని లాడ్జీలు, హోటళ్లలో పర్యాటకులు రాత్రి బస చేయడానికి అనుమతి లేకుండా చేశారు. ఏడాది పొడవునా అక్కడే నివసించే ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని అధికారులు సూచించారు.

బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు 11 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో సోమవారం అత్యంత విషాదకరమైన అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పిప్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని మనౌరి బజార్‌లో ఉన్న ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి వరుస పేలుళ్లకు దారితీశాయి. ఈ దుర్ఘటనలో 11 మంది సజీవ దహనం కాగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని వెంటనే ప్రయాగ్‌రాజ్‌లోని స్వరూప్ రాణి నెహ్రూ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఫుట్‌బాల్‌కు మెస్సీ గుడ్ బై! కన్నీళ్లు పెట్టిస్తున్న రిటైర్మెంట్ పోస్ట్..

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం, ప్రపంచ ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. అర్జెంటీనా జాతీయ జట్టు తరఫున రెండు దశాబ్దాలకు పైగా కొనసాగిన తన ప్రయాణానికి ముగింపు పలుకుతున్నట్లు మెస్సీ వెల్లడించారు. ఈ నిర్ణయం తనను తీవ్రంగా బాధించిందని, అయితే సమయం ఆసన్నమైందని అర్థం చేసుకున్నానని ఆయన భావోద్వేగంగా తెలిపారు. జాతీయ జట్టుకు వీడ్కోలు పలుకుతూ మెస్సీ చేసిన వ్యాఖ్యలు అభిమానులను కంటతడి పెట్టిస్తున్నాయి.

వెలిగొండకు కృష్ణా జలాల తరలింపు..రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు విమర్శలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకుండా ప్రేక్షకపాత్ర పోషించడం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు లాంటిదని ఆయన మండిపడ్డారు. ఎలాంటి వరద నీరు లేకపోయినా, అధికారిక కేటాయింపులు కూడా లేకుండానే కృష్ణా బేసిన్ వెలుపలి ప్రాంతాలకు ఏపీ ప్రభుత్వం వెలిగొండ ద్వారా నీటిని యథేచ్ఛగా తరలించుకుపోతోందని […]

సర్‌ ద్వారా దేశ జనాభాను ఈసీ తగ్గిస్తున్నది: అరవింద్ కేజ్రీవాల్

SIR ప్రక్రియ ద్వారా దేశ జనాభాను ఎన్నికల సంఘం తగ్గిస్తున్నదని ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు కేజ్రీవాల్ విమర్శించారు. ఢిల్లీ ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి 47 లక్షలకు పైగా ఓటర్ల పేర్లను ఈసీ తొలగించడంపై ‌ కేజ్రీవాల్‌ స్పందించారు. ‘జనాభా పెరుగుదల గురించి ప్రభుత్వం ఆందోళన చెందకూడదు. ఎందుకంటే ‘సర్‌’ ప్రక్రియ ద్వారా దేశ జనాభాను 140 కోట్ల నుంచి 50 కోట్లకు ఎన్నికల సంఘం తగ్గించగలదు’ అని ఎక్స్‌ […]

ఆర్మేనియా ప్రధానితో పిఎం మోడీ భేటీ…

పిఎం మోడీ సోమవారం ఆర్మేనియా ప్రధానమంత్రి నికోల్ పాషిన్యాన్‌తోనూ ప్రత్యేకంగా ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ‘బిష్కెక్‌లో ఆర్మేనియా ప్రధాని నికోల్ పాషిన్యాన్‌తో అద్భుతమైన సమావేశం జరిగింది” అని మోడీ తెలిపారు. భారత్-ఆర్మేనియా సహకారం రక్షణ, ఐటీ, అంతరిక్షం, విద్య, ఔషధాలు తదితర రంగాల్లో మరింత విస్తరించనుందని మోడీ చెప్పారు. రానున్న రోజుల్లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను కూడా మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.

కోమటిరెడ్డి ఆఫీసుపై బీజేపీ కార్యకర్తల దాడి

జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఆఫీసుపై బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్లు, టమాటాలతో విరుచుకపడ్డారు. అనంతరం మంత్రి ఆఫీసును తగలబెట్టే యత్నం చేశారు. తమ పార్టీ ఆఫీసుపైకి వస్తే ప్రతిఘటన తప్పదని బీజేపీ శ్రేణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ నాయకులు సైతం దాడికి తెగబడ్డారు. నల్లగొండ బీజేపీ ఆఫీసుపై దాడికి తెగబడ్డారు. జిల్లా అధ్యక్షుడి ఇంటిపై దాడి చేశారు. దీంతో జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత […]

Android మొబైల్‌లో ఈ యాప్స్ ఉంటే రిమూవ్ చేయండి: MHA వార్నింగ్

ఆండ్రాయిడ్ యాప్‌లతో ముడిపడి ఉన్న ఆర్థిక మోసాల కేసులు పెరిగినట్లు కేంద్ర హోమ్‌ మంత్రిత్వ శాఖ తెలిపింది. I4Cకి చెందిన నేషనల్ సైబర్ క్రైమ్ త్రెట్ అనలిటిక్స్ యూనిట్ (NCTAU) ప్రకారం, ఈ యాప్‌ల ప్రచారం ప్రధానంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కనిపించే యాడ్స్ ద్వారా జరుగుతోంది. సంబంధిత విభాగం గత వారం బుధవారం (ఆగస్టు 26) జారీ చేసిన అడ్వైజరీలో ‘Night Play, Kyss, Reloop, Vimo, Rivo, Nexo, Vixa’ వంటి పేర్లతో నడుస్తున్న […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON