ఆండ్రాయిడ్ యాప్లతో ముడిపడి ఉన్న ఆర్థిక మోసాల కేసులు పెరిగినట్లు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. I4Cకి చెందిన నేషనల్ సైబర్ క్రైమ్ త్రెట్ అనలిటిక్స్ యూనిట్ (NCTAU) ప్రకారం, ఈ యాప్ల ప్రచారం ప్రధానంగా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో కనిపించే యాడ్స్ ద్వారా జరుగుతోంది. సంబంధిత విభాగం గత వారం బుధవారం (ఆగస్టు 26) జారీ చేసిన అడ్వైజరీలో ‘Night Play, Kyss, Reloop, Vimo, Rivo, Nexo, Vixa’ వంటి పేర్లతో నడుస్తున్న appsను గుర్తించింది.

