SIR ప్రక్రియ ద్వారా దేశ జనాభాను ఎన్నికల సంఘం తగ్గిస్తున్నదని ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు కేజ్రీవాల్ విమర్శించారు. ఢిల్లీ ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి 47 లక్షలకు పైగా ఓటర్ల పేర్లను ఈసీ తొలగించడంపై కేజ్రీవాల్ స్పందించారు. ‘జనాభా పెరుగుదల గురించి ప్రభుత్వం ఆందోళన చెందకూడదు. ఎందుకంటే ‘సర్’ ప్రక్రియ ద్వారా దేశ జనాభాను 140 కోట్ల నుంచి 50 కోట్లకు ఎన్నికల సంఘం తగ్గించగలదు’ అని ఎక్స్ పోస్ట్లో మండిపడ్డారు.

