తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకుండా ప్రేక్షకపాత్ర పోషించడం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు లాంటిదని ఆయన మండిపడ్డారు. ఎలాంటి వరద నీరు లేకపోయినా, అధికారిక కేటాయింపులు కూడా లేకుండానే కృష్ణా బేసిన్ వెలుపలి ప్రాంతాలకు ఏపీ ప్రభుత్వం వెలిగొండ ద్వారా నీటిని యథేచ్ఛగా తరలించుకుపోతోందని హరీశ్ రావు ఆక్షేపించారు.

