దివంగత నందమూరి హరికృష్ణ 69వ జయంతి సందర్భంగా ఆయన కుమారులు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్ రామ్ సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నారు. తండ్రి హరికృష్ణ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగంతో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. తన తండ్రిని గుర్తుచేసుకుంటూ.. “ఈ అస్తిత్వం మీరు, ఈ వ్యక్తిత్వం మీరు. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్న మా ప్రస్థానానికి నేతృత్వం మీరు. ఆజన్మాంతం తలచుకునే అశ్రుకణం మీరే” అంటూ రాసుకొచ్చారు.