దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఆయనకు నివాళులర్పించారు. బుధవారం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్న జగన్.. ఆయనకు నివాళులర్పించారు. అనంతరం అక్కడ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. జగన్ తో పాటు ఆయన భార్య వైఎస్ భారతి, తల్లి విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు, వైసీపీ నాయకులు, ఆయన అభిమానులు కూడా వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.