అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం, ప్రపంచ ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటించారు. అర్జెంటీనా జాతీయ జట్టు తరఫున రెండు దశాబ్దాలకు పైగా కొనసాగిన తన ప్రయాణానికి ముగింపు పలుకుతున్నట్లు మెస్సీ వెల్లడించారు. ఈ నిర్ణయం తనను తీవ్రంగా బాధించిందని, అయితే సమయం ఆసన్నమైందని అర్థం చేసుకున్నానని ఆయన భావోద్వేగంగా తెలిపారు. జాతీయ జట్టుకు వీడ్కోలు పలుకుతూ మెస్సీ చేసిన వ్యాఖ్యలు అభిమానులను కంటతడి పెట్టిస్తున్నాయి.

