కల్వకుంట్ల కుటుంబం గుంపు మందలా జమై మంది సొమ్ము తిన్నారు… ఇప్పటికీ తింటున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయ్యింది… ఇన్నిరోజులు కేసీఆర్ విధులకు హాజరుకాకుండానే ఏకంగా రూ.12400000 జీతం తీసుకున్నాడని రేవంత్ తెలిపారు. కేసీఆర్ సెక్యూరిటీ, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ఇతర అవసరాల కోసం ప్రభుత్వం ఏకంగా రూ.22 కోట్లు ఖర్చు చేసిందని సీఎం తెలిపారు. ఫామ్ హౌస్ వీడి బయటకురాని మాజీ ముఖ్యమంత్రి కోసం ఈ ప్రభుత్వం కూడా భారీగా ఖర్చుచేయాల్సి వస్తోందన్నారు

