అమెరికాలోని ప్రసిద్ధ గ్రాండ్ కెన్యాన్ ప్రాంతాన్ని భారీ ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో 19మంది మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. భారీ సంఖ్యలో పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పార్కులోని లాడ్జీలు, హోటళ్లలో పర్యాటకులు రాత్రి బస చేయడానికి అనుమతి లేకుండా చేశారు. ఏడాది పొడవునా అక్కడే నివసించే ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని అధికారులు సూచించారు.

