ఇటీవల సంభవించిన భయంకరమైన వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్రంగా నష్టపోయిన నేపాల్‌కు అంతర్జాతీయ సమాజం అండగా నిలవాలని సీనియర్ నటి మనీషా కోయిరాలా తీవ్ర ఆవేదనతో అభ్యర్థించారు.ప్రకృతి విపత్తు నుంచి తేరుకోవడానికి నేపాల్‌కు అంతర్జాతీయ స్థాయిలో విస్తృత మద్దతు అవసరమని మనీషా స్పష్టం చేశారు. ముఖ్యంగా భౌగోళికంగా, ఆర్థికంగా సహకారం అందించగల పొరుగు దేశాలైన భారత్ మరియు చైనాలు తమ దేశానికి కొండంత అండగా నిలవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.