loader

ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్‌‌‌తో లావాదేవీలు బంద్.. ట్రంప్ ఆదేశాలు

ప్రముఖ ఏఐ స్టార్టప్ సంస్థ ఆంథ్రోపిక్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకిచ్చారు. సంస్థకు చెందిన క్లాడ్ ఏఐ సాంకేతికత వినియోగాన్ని ప్రభుత్వ విభాగాలన్నీ తక్షణం నిలిపివేయాలని తాజాగా ఆదేశించారు. నిఘా, మిలిటరీ వ్యవహారాలకు సంబంధించి క్లాడ్‌లోని భద్రతా నిబంధనలను పూర్తిగా తొలగించేందుకు ఆంథ్రోపిక్ అంగీకరించకపోవడంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా రక్షణ శాఖకు మాత్రం ఆరు నెలల సమయం ఇచ్చారు.

రోడ్డుపైకి దూసుకెళ్లిన విమానం: 15 మంది మృతి

దక్షిణా అమెరికాలోని బొలీవియా ప్రాంతంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్ ఆల్టో విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా రన్ వే నుంచి పక్కకు జరిగి రోడ్డుపైకి దూసుకెళ్లడంతో 15 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 30 మంది గాయపడడంతో డెల్ నార్టే ఆస్పత్రికి తరలించారు. నోట్ల కరెన్సీలో లోడుతో విమానం సాంటా క్రజ్ నుంచి ఎల్ ఆల్టో కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం నుంచి నోట్ల కట్టలు బయటపడడంతో స్థానికులు ఎగబడ్డారు.

గూగుల్ సరికొత్త ఏఐ కెరీర్ సర్టిఫికేట్

గూగుల్ సంస్థ సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సరికొత్త  AI ప్రొఫెషనల్ సర్టిఫికేట్  కోర్సును 2026 ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. కేవలం 10 గంటల వ్యవధిలో పూర్తి చేయగల ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లో ఏడు చిన్న కోర్సులు,  ఒక ప్రాజెక్ట్ ఉంటాయి. ఇందులో భాగంగా జెమిని ,  నోట్‌బుక్ ఎల్‌ఎమ్ వంటి అడ్వాన్స్‌డ్ టూల్స్‌ను ఉపయోగించి రిసెర్చ్ చేయడం, డేటా విశ్లేషణ, కంటెంట్ క్రియేషన్,  ఆటోమేషన్ పనులను ఎలా వేగంగా పూర్తి చేయాలో నేర్పిస్తారు.

అఫ్గాన్- పాక్ మధ్య యుద్ధం!- పరస్పర దాడుల్లో వందకు పైగా మృతి

పాకిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌లు. ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఈసారి మృతుల సంఖ్య భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. 55 మంది పాకిస్థానీ సైనికులను మట్టుబెట్టినట్లు తాలిబన్లు ప్రకటించగా, 133 మంది తాలిబన్లను హతమార్చినట్లు పాక్‌ సైన్యం వెల్లడించింది. గురువారం రాత్రి అఫ్గాన్‌ తాలిబన్‌ దళాలు సరిహద్దులోని పాక్‌ మిలిటరీ స్థావరాలపై ముందుగా విరుచుకుపడ్డాయి. ఫ్గానిస్థాన్ తాలిబాన్ ప్రభుత్వంతో బహిరంగ యుద్ధాన్ని ప్రకటిస్తున్నట్లు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు.

ఇజ్రాయెల్ అత్యున్నత పార్లమెంటరీ గౌరవం దక్కించుకున్న ప్రధాని మోదీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ అత్యున్నత పార్లమెంటరీ గౌరవం దక్కింది. ఇజ్రాయెల్ చట్టసభ ‘నెస్సెట్’లో చారిత్రాత్మక ప్రసంగం చేసిన మోదీకి.. ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ అమీర్ ఒహానా ‘స్పీకర్ ఆఫ్ ది నెస్సెట్ మెడల్’ను ప్రదానం చేశారు. ఈ పురస్కారం అందుకున్న తొలి భారత ప్రధానిగా ఆయన రికార్డు సృష్టించారు. భారత్-ఇజ్రాయెల్ వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడంలో మోదీ చూపిన అసాధారణ నాయకత్వానికి గుర్తింపుగా ఈ అత్యున్నత పతకాన్ని అందజేశారు.

ఇజ్రాయెల్‌ పౌరులను హమాస్‌ చంపడం దారుణం.. ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్ వెళ్లిన సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా బుధవారం ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌లో ప్రసంగించిన తొలి భారత ప్రధాని తానేనని మోదీ అన్నారు. ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌లో ప్రసంగం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. భారత్‌, ఇజ్రాయెల్‌.. ప్రాచీన నాగరికత కలిగిన దేశాలు. ఇజ్రాయెల్‌తో 140 కోట్ల భారతీయుల స్నేహం, గౌరవం, భాగస్వామ్యం ఉంది. ఉగ్రవాదంపై పోరులో ఇజ్రాయెల్‌కు పూర్తి అండగా […]

అమెరికాలోని న్యూ బ్రున్స్‌విక్‌ నగరంలో ఏఐ డాటా సెంటర్‌ ఏర్పాటు రద్దు

అమెరికాలోని న్యూ బ్రున్స్‌విక్‌ నగరం ఏఐ డాటా సెంటర్‌ను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నది. సహజ వనరులను యథేచ్ఛగా తోడివేసే ఈ సెంటర్‌లకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. వాటితో ఎంతో ప్రమాదం ఉన్నప్పటికీ.. మన దేశం ఏఐ డాటా సెంటర్ల కోసం వెంపర్లాడుతున్నది. ఇదే అదనుగా గూగుల్‌ వంటి కంపెనీలు భారత్‌లో డాటా సెంటర్ల ఏర్పాటకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఆ కంపెనీల ప్రధాన కేంద్రమైన అమెరికాలో […]

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం..

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం ఇజ్రాయెల్‌కు బయలుదేరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేందుకు యావత్ ఇజ్రాయెల్‌ సన్నద్ధమైంది. ప్రధాని మోదీ రాకను ప్రకటిస్తూ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆయనను తన స్నేహితుడిగా అభివర్ణించారు. నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ గడ్డపై అడుగు పెట్టడానికి ముందే, ఆయన గౌరవార్థం ఇజ్రాయెల్ నెస్సెట్ భారత జెండా రంగులలో వెలిగిపోయింది.  ఇజ్రాయెల్‌లోని ప్రముఖ పత్రిక జెరూసలేం పోస్ట్ తన మొదటి పేజీలో “నమస్తే మోదీ” […]

వరదల బీభత్సం.. 30 మంది మృతి

బ్రెజిల్ దేశాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా మినాస్ గెరైస్ రాష్ట్రంలో ప్రకృతి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. కేవలం కొద్ది రోజుల్లోనే అక్కడ రికార్డు స్థాయిలో 584MM వర్షపాతం నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇంతటి భారీ వర్షాల కారణంగా స్థానిక నదులు ప్రమాదకర స్థాయిని మించి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.కేవలం వరదలే కాకుండా, వర్షాల ధాటికి కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదాల్లో ఇప్పటివరకు 30 మంది ప్రాణాలు […]

పాకిస్తానీయుల దాడి..లండన్‌లో భారతీయ రెస్టారెంట్ మూసివేత..

లండన్‌లో భారత సంతతి వ్యక్తి చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. లండన్‌లో హర్మాన్ సింగ్ కపూర్ హ్యామ్మర్‌స్మిత్ ప్రాంతంలో 16 ఏళ్లుగా ఇండియన్ రెస్టారెంట్‌ నిర్వహిస్తున్నాడు. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులతోపాటు ఆన్‌లైన్ వేధింపులు, ముఖ్యంగా పాకిస్తానీయుల నుంచి తరచూ ఎదురవుతున్న దాడులు, బెదిరింపులు, అలాగే ఈ దాడుల అంశంలో పోలీసుల నుంచి సరైన మద్దతు లేని కారణంగా ఈ రెస్టారెంట్‌ను మూసేస్తున్నట్లు ప్రకటించాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON