భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం ఇజ్రాయెల్‌కు బయలుదేరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేందుకు యావత్ ఇజ్రాయెల్ సన్నద్ధమైంది. ప్రధాని మోదీ రాకను ప్రకటిస్తూ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆయనను తన స్నేహితుడిగా అభివర్ణించారు. నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ గడ్డపై అడుగు పెట్టడానికి ముందే, ఆయన గౌరవార్థం ఇజ్రాయెల్ నెస్సెట్ భారత జెండా రంగులలో వెలిగిపోయింది. ఇజ్రాయెల్‌లోని ప్రముఖ పత్రిక జెరూసలేం పోస్ట్ తన మొదటి పేజీలో “నమస్తే మోదీ” అనే శీర్షికతో ఆయన ఫోటోను ప్రచురించింది.

