ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల విద్యార్థినులపై లెక్చరర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ మహిళా కమిషన్‌కు ఒక మెయిల్ అందింది. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టేందుకు ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ డా.రాయపాటి శైలజ కళాశాలకు వెళ్లి విద్యార్థినులతో మాట్లాడి వివరాలు సేకరించారు. కళాశాల అంతర్గత కమిటీ విచారణలో అంతా సవ్యంగా ఉన్నట్లు నివేదిక వచ్చినా, విద్యార్థినులతో మాట్లాడిన తర్వాత లైంగిక వేధింపులు నిజమేనని నిర్ధారణ అయినట్లు ఆమె తెలిపారు.

