కాళేశ్వరం బ్యారేజీల ఆరోపణలపై జస్టిస్ సీపీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు తీర్పుపై మాజీమంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. సత్యమేవ జయతే అని ‘ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మం జయిస్తుందని, ‘ఇప్పటికైనా కక్షసాధింపులు, రాజకీయ దుష్ప్రచారం మానేసి వెంటనే రెండు పిల్లర్ల మరమ్మతులు పూర్తి చేసి తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు ఔనన్నా కాదన్నా…ముమ్మాటికీ కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం అని మాజీమంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా వెల్లడించారు.

