loader

వైద్య కళాశాల విద్యార్థినులపై లెక్చరర్‌ లైంగిక వేధింపులు నిజమే: మహిళా కమిషన్‌

ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల విద్యార్థినులపై లెక్చరర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ మహిళా కమిషన్‌కు ఒక మెయిల్ అందింది. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టేందుకు ఏపీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ డా.రాయపాటి శైలజ కళాశాలకు వెళ్లి విద్యార్థినులతో మాట్లాడి వివరాలు సేకరించారు. కళాశాల అంతర్గత కమిటీ విచారణలో అంతా సవ్యంగా ఉన్నట్లు నివేదిక వచ్చినా, విద్యార్థినులతో మాట్లాడిన తర్వాత లైంగిక వేధింపులు నిజమేనని నిర్ధారణ అయినట్లు ఆమె తెలిపారు.

అధ్యాపకుల బదిలీల్లో నిబంధన సడలించాలి: TGJLA

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై మూడు సంవత్సరాల నిబంధన వల్ల జూనియర్ లెక్చరర్లకు తీరని అన్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మూడు సంవత్సరాల నిబంధన విధిస్తే, మరోసారి బదిలీలకు దూరం కావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కావున, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేసే అధ్యాపకుల కోసం ప్రత్యేకంగా రెండేళ్ల సర్వీసు నిబంధనను అమలు చేసి, అర్హులైన వారందరికీ బదిలీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని వారు ముఖ్యమంత్రిని కోరారు.

పోలీసుల పహారా… గద్వాల్ లో బయటకు కదులుతున్న ఆర్టీసి బస్సులు

జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్టీసీలో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మధ్యరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగింది. ఉదయము 11.00 గంటల వరకు సమ్మె సాఫీగా కొనసాగుతున్నప్పటికీ 11.00 గంటల తర్వాత ప్రైవేట్ డ్రైవర్లు, ప్రైవేట్ కండక్టర్ల తో పోలీస్ పహార మధ్య ఆర్టిసి బస్సులు బయటకు కదిలాయి. గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి పోలీస్ పహార మధ్య బస్సులు బయటకి కదులుతున్నాయి.

ఐసీసీలో కీలక పదవికి వాసీమ్‌ ఖాన్‌ రాజీనామా.. పదవీకాలం ముగియకుండానే ఎందుకు..?

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మాజీ సీఈవో వాసిమ్ ఖాన్ ఐసీసీ (ICC) కీలక పదవి నుంచి వైదొలిగారు. ఐసీసీలో జనరల్ మేనేజర్‌ పదవికి ఆయన రాజీనామా చేశారు. నాలుగేళ్లపాటు ఆ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన తాజాగా ఆ పదవిని వీడారు. 2022లో జెఫ్‌ అల్లార్డెస్ నుంచి వాసీమ్‌ ఖాన్ బాధ్యతలను స్వీకరించారు. గత రెండేళ్లుగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. వివిధ కారణాలతో అత్యున్నత స్థాయిలో ఉండే వ్యక్తులు తమ పదవులను వీడుతున్నారు.

హైకోర్టు తీర్పుపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

కాళేశ్వరం బ్యారేజీల ఆరోపణలపై జస్టిస్ సీపీ ఘోష్ కమిషన్‌ నివేదికపై తెలంగాణ హైకోర్టు తీర్పుపై మాజీమంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. సత్యమేవ జయతే అని ‘ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మం జయిస్తుందని, ‘ఇప్పటికైనా కక్షసాధింపులు, రాజకీయ దుష్ప్రచారం మానేసి వెంటనే రెండు పిల్లర్ల మరమ్మతులు పూర్తి చేసి తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు ఔనన్నా కాదన్నా…ముమ్మాటికీ కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం అని మాజీమంత్రి హరీశ్ రావు ఎక్స్ […]

ఆర్‌టీసీ సమ్మెతో మెట్రోకు పెరిగిన గిరాకీ

హైదరాబాద్ నగరంలో ఆర్‌టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ప్రభావం సామాన్య ప్రయాణికులపై స్పష్టంగా కనిపిస్తోంది. బస్సులు రోడ్డెక్కకపోవడంతో ఆఫీసులకు, ఇతర పనులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రయాణికులందరూ మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. నగరంలోని దాదాపు అన్ని మెట్రో స్టేషన్లు ఉదయం నుంచే ప్రయాణికులతో నిండిపోయాయి. నగరంలో కీలకమైన ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ ప్రయాణికుల తాకిడితో కిటకిటలాడుతోంది. టికెట్ కౌంటర్లు, ఎంట్రీ గేట్ల వద్ద జనం భారీగా క్యూ కట్టారు. ప్లాట్‌ఫారమ్‌ల మీద కూడా […]

తెరపైకి విరాట్ కోహ్లీ ఓల్డ్ లవ్ స్టోరీ.. 12 ఏళ్ల తర్వాత కామెంట్ చేసిన మాజీ లవర్..!

ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఇజాబెల్, అనుష్క శర్మ, అవనీత్ కౌర్, లిజ్‌లాజ్ ఫోటోలను కలిపి ఒక కొలేజ్ పోస్ట్ చేశారు. దానికి “మైదానంలో ఉన్నా, బయట ఉన్నా విరాట్ ఎంపిక అద్భుతంగా ఉంటుంది” అని క్యాప్షన్ ఇచ్చారు. ఇది చూసిన ఇజాబెల్ తీవ్ర అసహనానికి గురైంది. తన పేరును మళ్లీ వివాదంలోకి లాగడంపై ఇజాబెల్ . “ఆ విషయాలు జరిగి 12 ఏళ్లు దాటిపోయింది.ప్రజలు ఇంకా ఎందుకు గతాన్ని వదిలి ముందుకు సాగలేకపోతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం […]

మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత.. .రాజకీయ ప్రస్థానం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు (90) కన్నుమూశారు..1935 జూన్‌ 23న గుంటూరులో జన్మించిన నాదెండ్ల భాస్కరరావు.. తొలిసారి 1978లో విజయవాడ ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన, మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఎన్టీఆర్‌తో టీడీపీ పార్టీని ఏర్పాటు చేశారు. 1982 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత ఎన్టీఆర్‌ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు.  1984 నుంచి ఆగస్ట్‌ 16 నుంచి సెప్టెంబర్‌ 16 వరకు నెలరోజులపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 11వ‌ ముఖ్యమంత్రిగా […]

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి వయసురీత్యా అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. గురువారం సాయంత్రం పంజాగుట్ట శ్మశానవాటికలో భాస్కర్ రావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

కంటైనర్ నౌకపై ఇరాన్ కాల్పులు.. హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తత

కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఓ కంటైనర్ నౌకపై ఇరాన్ కాల్పులు జరిపింది. పాకిస్తాన్‌లో జరగాల్సిన రెండో విడత కాల్పుల విరమణ చర్చలు విఫలమైన నేపథ్యంలో ఇరాన్ పారామిలిటరీ దళమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(UKMTO) బుధవారం హోర్ముజ్ జలసంధిలో ఒక కంటైనర్ నౌకపై కాల్పులు జరపింది. కాల్పుల్లో ఆ నౌక ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON