loader

బెంగళూరుకు షాకిచ్చిన గుజరాత్..

ఐపిఎల్‌లో భాగంగా గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య గుజరాత్ టైటాన్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 19.2 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ విరాట్ కోహ్లి 13 బంతుల్లోనే 28 పరుగులు చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన దేవ్‌దుత్ పడిక్కల్ 24 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో 40 పరుగులు సాధించాడు. కెప్టెన్ పటిదార్ 19 పరుగులు చేశాడు.

ఆ విషయంలో అగ్రస్థానంలో భారత్‌! రిపోర్ట్‌ రిలీజ్‌ చేసిన ఓపెన్‌ AI

ఇండియాలో ChatGPT ఇమేజెస్‌ 2.0 వినియోగం వేగంగా పెరుగుతోందని ఓపెన్‌ AI విడుదల చేసిన ప్రాథమిక గణాంకాలు వెల్లడించాయి. ప్రారంభించిన కేవలం ఒక వారంలోనే ఈ కొత్త AI ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను అత్యధికంగా ఉపయోగిస్తున్న దేశంగా భారత్ అగ్రస్థానానికి చేరినట్లు సమాచారం. భారతీయ వినియోగదారులు ఈ టూల్‌ను ప్రధానంగా సృజనాత్మక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని డేటా సూచిస్తోంది. సోషల్ మీడియా కోసం ఆకర్షణీయమైన విజువల్స్ రూపొందించడం, వ్యక్తిగత బ్రాండింగ్ మెరుగుపరచడం, డిజిటల్ స్టోరీటెల్లింగ్,  ఎడిట్స్ చేయడం […]

మధుసూదన్ సాయి ఫ్రీ మెడికల్ కాలేజీకి జాతీయ స్థాయి గుర్తింపు

భారతదేశపు మొట్టమొదటి ఉచిత గ్రామీణ వైద్య కళాశాలగా పేరుగాంచిన ఈ సంస్థ, ఇప్పుడు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ నుండి ఎంట్రీ-లెవల్ అక్రిడిటేషన్ సాధించి జాతీయ స్థాయిలో తన సత్తా చాటింది శ్రీ మధుసూదన్ సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌. పేదలకు ప్రపంచ స్థాయి వైద్యం ఉచితంగా అందించడమే మా లక్ష్యం. త్వరలోనే పూర్తి స్థాయి NABH అక్రిడిటేషన్‌ను కూడా సాధిస్తాము” అని సూపరింటెండెంట్ డాక్టర్ పద్మశ్రీ […]

35 మంది ఇన్‌స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతులు..!

దీర్ఘకాలంగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఇన్‌స్పెక్టర్లకు డీజీపీ శివధర్ రెడ్డి శుభవార్త చెప్పారు. 35 మంది ఇన్‌స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతులు కల్పించామని ఆయన వెల్లడించారు. డీజీపీ కార్యాలయంలో గురువారం నాడు పదోన్నతులు పొందిన 35 మంది డీఎస్పీలతో శివధర్ రెడ్డి సమావేశమయ్యారు. కోర్టు కేసులు, ఇతర సమస్యల వల్ల దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యను పరిష్కరించామని శివధర్ రెడ్డి తెలియజేశారు.

మహిళా సీఐని ఎక్సైజ్ శాఖ ఎందుకు సస్పెండ్ చేసిందో తెలిస్తే…

అక్రమ మద్యాన్ని అదుపు చేయాల్సిన ఒక బాధ్యతాయుతమైన సీఐ, ఆ మద్యాన్నే వ్యాపారంగా మార్చుకున్నారు. నంద్యాల జిల్లా డోన్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న వరలక్ష్మి, ఇటీవల కాలంలో వివిధ దాడుల్లో సుమారు 350 క్వార్టర్లకు పైగా అక్రమ మద్యాన్ని సీజ్ చేశారు.  సోమనాథ్ అనే వ్యక్తికి ఈ మద్యాన్ని రహస్యంగా విక్రయించారు. కారులో తరలిస్తున్న భారీ మద్యం నిల్వలతో సోమనాథ్ దొరికిపోయాడు. ఆరోపణలు నిజమేనని తేలడంతో నంద్యాల జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు […]

ఘాట్‌ రోడ్డులో ఆటో బోల్తా.. నలుగురి మృతి

పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాలకొండ నుంచి సీతంపేట వెళ్లే మార్గంలోని ఘాట్‌ రోడ్డులో ఓ ఆటో బోల్తా పడి నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. బొబ్బిలి నుంచి పార్వతీపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులకు పాలకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఆటో డ్రైవర్‌తోపాటు ముగ్గురు మహిళా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వారిని సీతంపేట ఏజెన్సీకి చెందిన గిరిజనులుగా పోలీసులు భావిస్తున్నారు.

226కు పైగా సీట్లు గెలుస్తాం.. ఎగ్టిట్ పోల్స్ పై మమత విమర్శలు

అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) 226కు పైగా సీట్లు సాధిస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలపై సిఎం మమతా బెనర్జీ గురువారం వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఎగ్జిట్ పోల్ గణాంకాలను బిజెపి కార్యాలయం నుంచి విడుదల చేశారని, తన మద్దతుదారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడానికే వాటిని సృష్టించారని మమత ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలపై విడుదలైన ఎగ్జిట్ పోల్ అంచనాలను దీదీ తీవ్రంగా విమర్శించారు.

యూజీసీ-నెట్ నోటిఫికేషన్ వచ్చేసింది, లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

2026 సంవత్సరానికి గాను మొదటి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (యూజీసీ-నెట్) పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది. ఈ పరీక్షలను జూన్ 22 నుంచి జూన్ 30 వరకు మొత్తం 85 సబ్జెక్టుల్లో అత్యంత పకడ్బందీగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 29న ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను అధికారికంగా ప్రారంభించినట్లు ఎన్టీఏ తమ తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించడానికి, పరీక్ష ఫీజు చెల్లించడానికి మే 20వ తేదీ రాత్రి 11.50 గంటల […]

సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో ముగిసిన ఏసీబీ సోదాలు

సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు ముగిశాయి. ప్రాపర్టీ టాక్స్ తగ్గించడానికి బిల్ కలెక్టర్ నిఖిల్ రెడ్డి రూ.35 వేలు ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేశాడు. ఇప్పటికే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అయిన నిఖిల్ బాధితుడి నుంచి 20 వేల రూపాయలు తీసుకున్నాడు. నేడు నిఖిల్ రెడ్డి బాధితుడి నుంచి 15 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. కేసు నమోదు చేసి నిఖిల్ రెడ్డిని కోర్టులో ప్రొడ్యూస్ చేశామని ఏసీబీ డిఎస్పీ […]

తెలంగాణలో జియో 5జీ ఆధిపత్యం… ట్రాయ్ పరీక్షల్లో అగ్రస్థానం

టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) మార్చి 2026లో నిర్వహించిన స్వతంత్ర డ్రైవ్ టెస్ట్‌లో వరంగల్ నగరంలో జియో 5జీ సేవలు అగ్రస్థానంలో నిలిచాయి. డేటా వేగం, వాయిస్ నాణ్యత, లేటెన్సీ, సిగ్నల్ బలం అన్ని విభాగాల్లో జియో ఇతర సంస్థలకంటే ముందంజలో ఉందని నివేదిక తెలిపింది. ముఖ్య ప్రాంతాల్లో అత్యధిక డౌన్‌లోడ్ వేగం నమోదు కాగా కాల్ కనెక్టివిటీ కూడా స్థిరంగా ఉన్నట్టు వెల్లడైంది. ట్రాయ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం జియో నెట్‌వర్క్ సగటు డౌన్‌లోడ్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON