ఇండియాలో ChatGPT ఇమేజెస్ 2.0 వినియోగం వేగంగా పెరుగుతోందని ఓపెన్ AI విడుదల చేసిన ప్రాథమిక గణాంకాలు వెల్లడించాయి. ప్రారంభించిన కేవలం ఒక వారంలోనే ఈ కొత్త AI ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను అత్యధికంగా ఉపయోగిస్తున్న దేశంగా భారత్ అగ్రస్థానానికి చేరినట్లు సమాచారం. భారతీయ వినియోగదారులు ఈ టూల్‌ను ప్రధానంగా సృజనాత్మక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని డేటా సూచిస్తోంది. సోషల్ మీడియా కోసం ఆకర్షణీయమైన విజువల్స్ రూపొందించడం, వ్యక్తిగత బ్రాండింగ్ మెరుగుపరచడం, డిజిటల్ స్టోరీటెల్లింగ్, ఎడిట్స్ చేయడం వంటి వినియోగాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

