పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాలకొండ నుంచి సీతంపేట వెళ్లే మార్గంలోని ఘాట్ రోడ్డులో ఓ ఆటో బోల్తా పడి నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. బొబ్బిలి నుంచి పార్వతీపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులకు పాలకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఆటో డ్రైవర్‌తోపాటు ముగ్గురు మహిళా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వారిని సీతంపేట ఏజెన్సీకి చెందిన గిరిజనులుగా పోలీసులు భావిస్తున్నారు.

