పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పేరుతో బీజేపీ ఓట్లను దొంగిలించిందని మమత బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు లక్షలాది మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడం వెనుక పెద్ద స్కెచ్ ఉందని ఆమె వాదించారు. “ఇది పక్కాగా రూపొందించిన బీజేపీ పథకం. టీఎంసీకి బలంగా ఉన్న ప్రాంతాల్లో ఓట్లను మాయం చేసి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు” అని ఆమె మండిపడ్డారు.

