టీవీకే పార్టీ అధికారం చేపట్టబోతుందనే అంచనాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో నటి త్రిష విజయ్ ఇంటికి చేరుకున్నారు. ఆమె పుట్టిన రోజుతో పాటు ఫలితాలు ఒకే రోజు కావడంతో త్రిష తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతి నుంచి నేరుగా విజయ్ ఇంటికి వెళ్లారు. అంతకుముందే విజయ్ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు విజయ్ అభిమానులతో పాటు, టీవీకే కార్యకర్తలు దళపతి ఇంటివద్దకు భారీగా చేరుకుంటున్నారు.

