ఐపీఎల్ 2026 సీజన్ సాగుతుండగా, మైదానం వెలుపల ఆటగాళ్ల ప్రవర్తనపై బిసిసిఐ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్ వంటి స్టార్ క్రికెటర్లు తమ గర్ల్‌ఫ్రెండ్స్‌తో బహిరంగంగా తిరగడం, వారితో కలిసి ప్రయాణాలు చేయడంపై బోర్డు పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిసిసిఐ నిబంధనల ప్రకారం ఆటగాళ్లతో భార్యలు, తల్లిదండ్రులు హోటల్ బసలో, ప్రయాణాల్లో అనుమతి ఉంటుందని . “అధికారిక గర్ల్‌ఫ్రెండ్” అనే హోదా లేదా నిబంధన బోర్డులో ఎక్కడా లేదని బోర్డు ఉన్నత స్థాయి అధికారి స్పష్టం చేశారు.

