కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఓ కంటైనర్ నౌకపై ఇరాన్ కాల్పులు జరిపింది. పాకిస్తాన్‌లో జరగాల్సిన రెండో విడత కాల్పుల విరమణ చర్చలు విఫలమైన నేపథ్యంలో ఇరాన్ పారామిలిటరీ దళమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(UKMTO) బుధవారం హోర్ముజ్ జలసంధిలో ఒక కంటైనర్ నౌకపై కాల్పులు జరపింది. కాల్పుల్లో ఆ నౌక ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

