loader

పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగి ఇవాళ్టికి ఏడాది పూర్తైన నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘పహల్గామ్‌ దాడిలో మరణించిన అమాయకులను ఎన్నటికీ మరిచిపోము. వారిని స్మరించుకుందాం. ఆ దాడిలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి నా సానుభూతి. దుఃఖ సమయంలోనూ మనం ఐక్యంగా నిలబడాలి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్‌ తలొగ్గదు. ఉగ్రవాదుల కిరాతక కుట్రలు ఎప్పుడూ సఫలం కాలేవు’అని ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్రమోడీ వెల్లడించారు.