కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ నిమిత్తం ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా అప్పటి ప్రభుత్వ పెద్దలు మరియు సంబంధిత అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. విచారణ ప్రక్రియలో సహజ న్యాయ సూత్రాలను విస్మరించారని, నిబంధనలకు విరుద్ధంగా విచారణ సాగిందని కోర్టు అభిప్రాయపడింది. ముఖ్యంగా విచారణ కమిషన్ల చట్టంలోని సెక్షన్ 8B, 8C ప్రకారం బాధ్యులకు నోటీసులు ఇచ్చి వారి వివరణ తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, ఆ ప్రక్రియను సరిగ్గా అనుసరించలేదని పిటిషనర్లు చేసిన వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది.

