డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై తాజాగా మరో కేసు నమోదైంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించారనే ఆరోపణలతో పోలీసులు కేసు పెట్టారు. నలుగురు సాక్షుల ఫిర్యాదుతో ఈ కేసు ఫైల్ చేశారు. పోలీసులు అనంతబాబును అదుపులోకి తీసుకునేందుకు వెళ్లగా.. అప్పటికే ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయారు. అనంతబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు.. ఈ కేసులో మరొకర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

