loader

ఇజ్రాయెల్ అత్యున్నత పార్లమెంటరీ గౌరవం దక్కించుకున్న ప్రధాని మోదీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ అత్యున్నత పార్లమెంటరీ గౌరవం దక్కింది. ఇజ్రాయెల్ చట్టసభ ‘నెస్సెట్’లో చారిత్రాత్మక ప్రసంగం చేసిన మోదీకి.. ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ అమీర్ ఒహానా ‘స్పీకర్ ఆఫ్ ది నెస్సెట్ మెడల్’ను ప్రదానం చేశారు. ఈ పురస్కారం అందుకున్న తొలి భారత ప్రధానిగా ఆయన రికార్డు సృష్టించారు. భారత్-ఇజ్రాయెల్ వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడంలో మోదీ చూపిన అసాధారణ నాయకత్వానికి గుర్తింపుగా ఈ అత్యున్నత పతకాన్ని అందజేశారు.

ఇజ్రాయెల్‌ పౌరులను హమాస్‌ చంపడం దారుణం.. ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్ వెళ్లిన సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా బుధవారం ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌లో ప్రసంగించిన తొలి భారత ప్రధాని తానేనని మోదీ అన్నారు. ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌లో ప్రసంగం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. భారత్‌, ఇజ్రాయెల్‌.. ప్రాచీన నాగరికత కలిగిన దేశాలు. ఇజ్రాయెల్‌తో 140 కోట్ల భారతీయుల స్నేహం, గౌరవం, భాగస్వామ్యం ఉంది. ఉగ్రవాదంపై పోరులో ఇజ్రాయెల్‌కు పూర్తి అండగా […]

మనీ లాండరింగ్ కేసులో అనిల్ అంబానీకి ఈడీ షాక్.. రూ.3,716 కోట్ల ఇల్లు అటాచ్

మనీ లాండరింగ్ కేసులో వ్యాపారవేత్త అనిల్ అంబానీకి ఈడీ షాకిచ్చింది. ముంబైలోని అనిల్ అంబానీకి చెందిన రూ.3,716 కోట్ల ఖరీదైన ఇంటిని ఈడీ అటాచ్ చేసింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) సంస్థ బ్యాంకు మోసాలకు పాల్పడిందనే ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరుపుతోంది. ఈ కేసులో మొత్తం ఇప్పటివరకు రూ.12,000 కోట్ల విలువైన అనిల్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

హైకోర్టులో ఐపీఎస్ సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్

ఏపీ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఇవాళ(బుధవారం) ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో సునీల్ నాయక్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం సునీల్ నాయక్‌ను అరెస్ట్ చేసేందుకు ఎస్పీ దామోదర్ బిహార్ వెళ్లారు. ఈ క్రమంలోనే ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చేందుకు నిరాకరించింది బిహార్ కోర్టు.

తిరుమల శ్రీవారి దర్శనం వివాదం.. క్లారిటీ ఇచ్చిన లిటిల్ హార్ట్స్ శివానీ నాగారం

నటి శివానీ నాగారం ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తనకు తిరుమలలో 15 నిమిషాల పాటు స్వామివారి దర్శనం కలిగిందని చెప్పడం వివాదానికి దారితీసింది. సెలబ్రిటీలకు టీటీడీ పెద్దపీట వేస్తోందని నెటిజన్లు విమర్శించగా, శివానీ తాజాగా వీడియో ద్వారా వివరణ ఇచ్చింది. తాను తన తల్లితో కలిసి రూ. 10500 శ్రీవాణి దర్శనం టికెట్లు తీసుకొని వెళ్లామని తెలిపింది. లైన్‌లో స్వామివారు వెళ్లే మొత్తం సమయాన్ని కలిపి తాను 15 నిమిషాలని అన్నానని, అంతేకానీ గర్భాలయంలో ఎవరూ తనను […]

హెచ్‌ఐవీ కేసుల్లో టాప్‌లో మేఘాలయ.. 10,000 మందికిపైగా రోగులు

హెచ్‌ఐవీ కేసుల్లో దేశంలోనే అగ్రస్థానంలో మేఘాలయ నిలిచింది. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం పది వేల మందికిపైగా ఎయిడ్స్‌ రోగులు చికిత్స పొందుతున్నారు. మేఘాలయ ఆరోగ్య మంత్రి స్వయంగా ఈ విషయాన్ని అసెంబ్లీకి వెల్లడించారు. గత పదేళ్లలో మేఘాలయలో హెచ్‌ఐవీ కారణంగా 749 మంది మరణించినట్లు ఆరోగ్య మంత్రి షిల్లా తెలిపారు. తూర్పు ఖాసీ హిల్స్‌లో 435, పశ్చిమ జైంటియా హిల్స్‌లో 123, తూర్పు జైంటియా హిల్స్‌లో 90, రి భోయ్‌లో 51ఎయిడ్స్‌ మరణాలు నమోదైనట్లు చెప్పారు.

పాఠ్యాంశం తొలగిస్తాం.. సుప్రీం సీరియస్‌పై కేంద్రం

ఎన్‌సీఈఆర్‌టీ 8వ తరగతి పాఠ్యాంశంలో ‘న్యాయవవస్థలో అవినీతి’ అంశాన్ని ప్రవేశపెట్టడంపై సుప్రీంకోర్టు సీరియస్‌ కావడంతో కేంద్రం వెంటనే స్పందించింది. పాఠ్యాంశంలోని భాగాలను తొలగించేందుకు నిర్ణయించింది. పాఠ్యాంశంలో ఆవిధంగా వచ్చి ఉండాల్సింది కాదని, దీనికి బదులు స్ఫూర్తిదాయకమైన విషయాలను రాసి ఉండాల్సిందని కేంద్రం అభిప్రాయపడినట్టు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఎన్‌సీఈఆర్‌టీ 8వ తరగతి పాఠ్యాశంలో న్యాయవ్యవస్థలో అవినీతి అంశాన్ని ప్రవేశపెట్టడంపై సుప్రీంకోర్టు బుధవారంనాడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీతో పోటీపడుతూ వాణిజ్య రాజధాని ముంబైలో కూడా వాయుకాలుష్యం పెరిగిపోతోంది. రోజూ గాలి నాణ్యత పడిపోతోంది. ఈ విషయాన్ని తాజా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) నివేదిక తేల్చింది. ఇటీవల ఏక్యూఐ ఏకంగా కొన్నిచోట్ల 300 పాయింట్లు దాటింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టడం, సిటీలో చెత్తను తగలబెట్టడం ప్రధాన కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే నిర్మాణ రంగం నుంచి వచ్చే సన్నని ఇసుక, రోడ్లపై నుంచి లేచే మట్టి వంటివి […]

కొత్త జిల్లాలో సీఎం చంద్రబాబు.. కీలక ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన

నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం తొలిసారి పర్యటించి, ప్రతిష్టాత్మక వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రాజెక్టు పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి జనవరిలోనే నూతన జిల్లాను ఏర్పాటు చేశామని, ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టును కూడా శరవేగంగా పూర్తి చేసి తీరుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.

రహదారిపై బైఠాయించిన బాధితులు

ఖమ్మం పట్టణ శివారులోని భూదాన్ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న వారి ఇళ్లను ప్రభుత్వ యంత్రాంగం తొలగించింది. తాము రోడ్డుపై పడిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తూ బాధితులు ఖమ్మం–వైరా రోడ్డుపై ధర్నాకు దిగారు. ఇళ్లను ఖాళీ చేయించి, నిర్వాసితులను పట్టణంలోని అంబేద్కర్ భవన్‌కు తరలించినట్లు సమాచారం. అయితే తగిన సౌకర్యాలు కల్పించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులకు మద్దతుగా బీజేపీ నేతలు వైరా రహదారిపై ధర్నాలో పాల్గొని, తక్షణమే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON