ఏపీ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఇవాళ(బుధవారం) ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో సునీల్ నాయక్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం సునీల్ నాయక్‌ను అరెస్ట్ చేసేందుకు ఎస్పీ దామోదర్ బిహార్ వెళ్లారు. ఈ క్రమంలోనే ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చేందుకు నిరాకరించింది బిహార్ కోర్టు.

