ఇటలీ, బెర్గామోలోని కోవోలో ఇద్దరు భారతీయులు హత్యకు గురయ్యారు. ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న గురుద్వారా మాతా సాహిబ్ కౌర్ జీ వద్ద జరిగింది. రాగిందర్ సింగ్ (48), గుర్మిత్ సింగ్ (48) అనే ఇద్దరు వ్యక్తులు శుక్రవారం రాత్రి గురుద్వారా నుంచి బయటకు వస్తుండగా ఆయుధాలతో వచ్చిన దుండగుడు ఇద్దరిపై సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రాగిందర్, గుర్మిత్ సింగ్ అక్కడికక్కడే మరణించారు. అనంతరం దుండగుడు కారులో పరారయ్యాడు. అయితే, హత్యకు పాల్పడింది కూడా ఇండియనే అని ప్రాథమికంగా తెలుస్తోంది

