వేములవాడ నియోజకవర్గం అగ్రహారానికి చెందిన ప్రముఖ ఉద్యమకారురాలు తెలంగాణ సత్తెమ్మ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సత్తెమ్మ పార్థీవ దేహానికి నివాళులర్పించిన కేటీఆర్.. స్వయంగా పాడె మోశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్తెమ్మ చురుకైన పాత్ర పోషించారని కేటీఆర్ అన్నారు. ఉద్యమ సమయంలో ప్రతిరోజూ పాల్గొంటూ ‘జై తెలంగాణ’ నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనిత ఆమె. స్వరాష్ట్ర సాధన కోసం సత్తెమ్మ చేసిన పోరాటం, ఆమె అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని కేటీఆర్ కొనియాడారు.

